
బ్రేకింగ్ న్యూస్
రాహుల్ గాంధీ అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 22 ( వార్త సంధ్య )
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టును కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
ఆయన మాట్లాడుతూ, నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని, నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాన్ని దాచలేదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని గంప ప్రసాద్ స్పష్టం చేశారు

