భద్రాద్రి జిల్లా బ్యూరో, ఆగస్టు 09 (వార్త సంధ్య) : పాత పాల్వంచ 46వ డివిజన్ ఇంచార్జ్ ముత్యాల ప్రవీణ్–శ్రీలత దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాల ప్రవీణ్–శ్రీలత దంపతులు ఆయురారోగ్యాలతో, ఆనందంగా, సుఖసంతోషాలతో జీవిస్తూ ఇలాంటి వివాహ వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వారి దాంపత్య జీవితం ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలు, సంతోషాలతో నిండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన నాయకులు వాసుమల్ల గౌతమ్, బీఆర్‌ఎస్ నాయకులు డీఆర్‌కే, ఆర్కే, కళ్యాణ్ తదితరులు పాల్గొని ముత్యాల ప్రవీణ్–శ్రీలత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు
RELATED ARTICLES

