ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పెనుగొలను లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

పెనుగొలను లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

📰 Generate e-Paper Clip

తిరువూరు (వార్త సంధ్య) – మార్చి 15: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను హైస్కూల్‌లో ఆదివారం గురి సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో కంటి, గుండె, కిడ్నీ, బీపీ, షుగర్ మరియు ఇతర సాధారణ వ్యాధులకు సంబంధించి మొత్తం 338 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ మరియు శంకర్ ఐ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు, సిబ్బంది పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమాన్ని గురి సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు వి.వి. రామారావు (నాని) మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!