ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఘనంగా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

ఘనంగా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: హైదరాబాద్‌లోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్‌లో బీడీఎస్ బ్యాచ్–2020 మరియు ఎండీఎస్ బ్యాచ్–2022 విద్యార్థుల పట్టభద్రత సందర్భంగా గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. వైద్య వృత్తిలో నైతిక విలువలు, సేవాభావం మరియు నైపుణ్యాన్ని పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని ఆయన సూచించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సర్జీవ్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యను సమాజ సేవకు ఉపయోగించి బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్స్, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!