ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నర్సిపురం కవి, రచయిత గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారం

నర్సిపురం కవి, రచయిత గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారం

📰 Generate e-Paper Clip

తెలుగు భాష సేవలకు గుర్తింపుగా విశిష్ట పురస్కారం

శ్రీకాకుళం, ఆగస్టు 18 (వార్త సంధ్య): పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామానికి చెందిన కవి, రచయిత గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారం లభించింది. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ప్రథమ శాఖ గ్రంథాలయం, థామ్సన్ రోడ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కవులు, రచయితలు, కళాకారులు, భాషాభిమానులను సత్కరించారు. తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

డా. యు.వి. రత్నం మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి, జాతీయ అధ్యక్షురాలు ప్రముఖ వైద్యురాలు డా. పైడి సింధూర చేతుల మీదుగా గంటా రామకృష్ణకు మాతృభాషా సేవా ప్రజ్వలిత పురస్కారంతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గంటా రామకృష్ణ మాట్లాడుతూ కళింగాంధ్ర ప్రాంతంలో తెలుగు భాష అభివృద్ధికి ఎందరో మహానుభావులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అలాంటి మహనీయులు నడయాడిన శ్రీకాకుళం గడ్డపై మాతృభాషా సేవా పురస్కారం అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తియ్యదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు మరింత కృషి చేయాల్సిన బాధ్యత ఈ పురస్కారంతో పెరిగిందని తెలిపారు.

కార్యక్రమంలో పార్వతీపురం కవి సుధాకర్, కవి ఇందిరా ప్రసాద్, ప్రముఖ కవి, సేవకులు భోగల ఉమామహేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది సోడవరపు ఈశ్వరరావు, సంఘసేవకులు, శ్రీకాకుళం అధ్యక్షులు గుత్తావిల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి విజయలక్ష్మణ్, నాట్యగురువు తేజతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!