భద్రాద్రి, (వార్త సంధ్య) : బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో ఆగస్టు 10న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అందుబాటులో ఉండరని, ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు ఆగస్టు 10న ఐడీఓసీ కార్యాలయానికి రావద్దని సూచించారు.

