ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డినరసన్నపల్లిలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

నరసన్నపల్లిలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

బ్రేకింగ్ న్యూస్

నరసన్నపల్లిలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  జూన్ 25 ( వార్త సంధ్య): నరసన్నపల్లిలో ఓ ప్రైవేట్ టీచర్ అనారోగ్య కారణాలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌కు చెందిన దేదిక (25), ఉల్లాస్ కుమార్తె, ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ నరసన్నపల్లిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇటీవల విద్యానికేతన్ పాఠశాలలో టీచర్‌గా చేరినట్లు తెలిసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దేదిక, నిన్న తన అద్దె ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న ఆమె తల్లి డాలీ కేరళ నుంచి వచ్చి ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.మృతికి సంబంధించిన ఖచ్చితమైన కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా అనారోగ్య కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!