భద్రాద్రి, జూలై 15 (వార్త సంధ్య): తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం జూలై 24 వరకు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన గడువు ముగియనున్న నేపథ్యంలో, ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ పూర్తికాని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికీ కొంతమంది ఓటర్లకు ఫారాలు అందలేదని, మరికొన్ని ప్రాంతాల్లో సేకరణ ప్రక్రియ పూర్తికాలేదని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఓటర్లందరికీ అవకాశం కల్పించే ఉద్దేశంతో గడువును జూలై 24 వరకు పొడిగించారు.
ఎస్ఐఆర్ గడువు జూలై 24 వరకు పొడిగింపు
RELATED ARTICLES

