వనపర్తి బసవన్నగడ్డ కాలనీలో దోపిడీ కలకలం..
వనపర్తి జిల్లా,ప్రతినిధి, (వార్త సంధ్య ) నవంబర్ 4:
వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్న గడ్డ కాలనీలో దోపిడీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తుతెలియని వ్యక్తి కొడవలితో బెదిరించి,సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు.
బాధితురాలు విమల తెలిపిన వివరాల ప్రకారం,రాత్రి 8:30 గంటల సమయంలో టోపీ, మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం కొడవలితో బెదిరించి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు,చెవి కమ్మలను బలవంతంగా లాక్కున్నాడు. అనంతరం ఆమెను బాత్‌రూమ్‌లో బంధించి అక్కడి నుంచి పరారయ్యాడు.
కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త బాత్‌రూమ్‌లో ఉన్న విమలను బయటకు తీశారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. తనపై దాడికి పాల్పడి బంగారు ఆభరణాలను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరారు.

