ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం

ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 22 (వార్త సంధ్య) : ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా స్థానిక గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండవ తరగతి చదువుతున్న బాలుడు విశ్వామిత్ర చౌహన్ 1500 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి గుర్తింపులు పొందిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు బాలుడు చౌహన్‌ ను శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి.మణి మృదుల, విద్యార్థులు, పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!