
వార్త సంధ్య ప్రతినిధి 21/07/2026
విచారణకు ముందే 95 ఏళ్ల శాంతి నాయకుడు చైర్మన్ లీ మాన్-హీ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘన
హెవీన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్ డబ్ల్యూపీఎల్) చైర్మన్ లీ మాన్-హీ గారిని వెంటనే విడుదల చేయాలని భారతలో ప్రముఖుల డిమాండ్
హైదరాబాద్, జూలై 21: దక్షిణ కొరియాలో విచారణ ప్రారంభం కాకముందే 95 ఏళ్ల ప్రపంచ న శాంతి నాయకుడు ఛైర్మన్ లీ మాన్ హీ గారిని హెవెస్లీ కల్చర్ వరల్డ్ పీస్ రెస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్ డబ్ల్యూపీఎల్) సంస్థ చైర్మన్ మరియు షిన్సోన్టి చర్చి ఆఫ్ జీసస్ వ్యవస్థాపకుడు చైర్మెన్ మాన్-హీను నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన అని భారత్ లో ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
టిమ్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (TIMEF) ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యాయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, మత నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని ఆయనను తక్షణమే విడుదల చేయాలని దక్షిణ కొరియా ప్రభుత్వాన్ని కోరారు.
విచారణ ప్రారంభం కాకముందే ఒక వృద్ధ శాంతి కార్యకర్తను నిర్బంధించడం ‘నిర్దోషిత్వ భావన’ అనే ప్రాథమిక న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ (Due Process) మరియు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమం ప్రారంభంలో 2013లో స్థాపించబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా హెచ్ వ్యాప్తంగా హెచ్ఐడబ్ల్యూపీఎల్ నిర్వహిస్తున్న శాంతి కార్యక్రమాలను హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రెస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్ డబ్ల్యూపీఎల్) ప్రతినిధి కరుణాకర్ వ వరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఫిలిప్పీన్స్ లోని మండనావో శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడం, డిక్లరేషన్ ఆఫ్ పీస్ అండ్ స్సెషన్ ఆఫ్ వార్ (DPCW) రూపకల్పన చేసారు. అలాగే ప్రస్తుతం 94 దేశాల్లో కొనసాగుతున్న శాంతి విద్యా కార్యక్రమాలను ప్రస్తావించారు.
ఫైల్ 1.. ప్రతి మనిషికి న్యాయమైన విచారణ హక్కు ఉంది: డా. హసన్
టీమ్ ఎంపవర్మెంట్ వ్యవస్థాపకులు, లు, చైర్మన్ డా. మొహమ్మద్ మొయినుద్దీన్ హసన్ అల్తాఫ్ మాట్లాడుతూ, జాతి, మతం, దేశం అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి న్యాయం, గౌరవం, సమానత్వానికి అర్హుడని అన్నారు.
తాము కోర్టుల స్వతంత్రతను గౌరవిస్తున్నామని, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే సమాజానికి దశాబ్దాలుగా సేవలందించిన 95 ఏళ్ల వృద్దుడికి కూడా ఇతరుల మాదిరిగానే న్యాయమైన విచారణ, నిర్దోషిత్వ భావన, చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ హక్కులు కల్పించాల్సిందేనని పేర్కొన్నారు.
ఫైల్ 2.. అన్యాయంపై మౌనం ఉండకూడదు: బీసీ నేత సూర్య రావు తెలంగాణ బీసీ సమాజ్ అధ్యక్షుడు సూర్యరావు మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం జీవితాన్ని అంకితం
చేసిన వ్యక్తిని విచారణకు ముందే నిర్బంధించడం ఆందోళనకరమని అన్నారు.
“మంచి పని చేసే వారిని అడ్డుకోవడానికి ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం చైర్మన్ లీ విషయంలో కూడా అదే జరుగుతోంది. అందుకే మేము మౌనంగా ఉండము’ అని ఆయన అన్నారు. ప్రపంచ శాంతికి సేవలందించిన ఈ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫైల్ 3.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన: డా. గౌడ్ కిరణ్ కుమార్
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIDBCSA) జాతీయ అధ్యక్షుడు డా. గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ. ఇది ఒక వ్యక్తికి మద్దతు తెలిపే అంశం కాదని, చట్ట పరిపాలన మరియు మానవ హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (UDHR) మరియు అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒప్పందం (ICCPR)ప్రకారం విచారణకు ముందే అనవసర నిర్బంధం, నిర్దోషిత్వ భావనను విసురించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తెలిపారు.
దక్షిణ కొరియా ప్రభుత్వం తన అంతర్జాతీయ బాధ్యతలను గౌరవించి, చైర్మన్ ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
ఫైల్ 4.. ప్రజాభిప్రాయం కాదు… చట్టమే ముఖ్యం : ప్రొఫెసర్ అన్వర్ ఖాన్
సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ ప్రజాభిప్రాయం లేదా రాజకీయ
ఒత్తిళ్ల ఆధారంగా కాకుండా, చట్టం మరియు సాక్ష్యాధారాల ఆధారంగా పనిచేయాలని అన్నారు. హింసాత్మక నేరాలు కాని ఆరోపణల నేపథ్యంలో 95 ఏళ్ల వృద్దుడిని విచారణకు ముందే నిర్బంధించడం అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉండాలని, అది కూడా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు.
“న్యాయం ప్రతి మనిషికి చెందిన సార్వత్రిక హక్కు. న్యాయం రక్షించబడితేనే మానవ గౌరవం, శాంతి
పరిరక్షించబడతాయి’ అని ఆయన అన్నారు.
ఫైల్ 5.. యుద్ధ వీరుడి నిర్బంధం దక్షిణ కొరియాకే అవమానం:
రెవరెండ్. వై. శ్రీను
స్వతంత్ర పాస్టర్స్ యూనియన్ తరఫున మాట్లాడిన రెవరెండ్. వై. శ్రీను, డ్. వై. శ్రీను, ఛైర్మన్ లీ ప్రపంచ శాంతి, మత సామరస్యం, రక్తదాన ఉద్యమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు.
అలాగే కొరియా యుద్ధంలో దేశం కోసం పోరాడిన మాజీ సైనికుడైన 95 ఏళ్ల వృద్ధుడిని విచారణకు ముందే నిర్బంధించడు దక్షిణ కొరియా అంతర్జాతీయ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే చర్య అని పేర్కొన్నారు.
62 మంది పాస్టర్ల పిటిషన్ సమర్పణ
కార్యక్రమం ముగింపులో 62 మంది పాస్టర్లు ఆయనను తక్షణమే విడుదల చేయాలని వారు గారు సంయుక్తంగా విజ్ఞప్తి సంతకం చేసిన వినతి పత్రం ను రెవరెండ్. వై. శ్రీను సమర్పించారు. అనంతరం సమావేశానికి హాజరైన ప్రముఖులు, మత నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా విడుదల వినతి పత్రం పై సంతకాలు చేశారు.
దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్దోషిత్వ భావన, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలు పాటిస్తూ చైర్మన్ లీ మాన్-హీ గారికి న్యాయమైన విచారణ కల్పించి, ఆయనను తక్షణమే విడుదల చేయాలని వారు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.
సంతకాలతో కూడిన పిటిషన్లను దక్షిణ కొరియా సంబంధిత అధికారులకు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలకు మరియు ఐక్యరాజ్యసమితికి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

