బ్రేకింగ్ న్యూస్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య )
- కామారెడ్డి పట్టణంలోని YN కాలనీ రామ్ లాలా క్షేత్రంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధం ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల బాక్సులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ వి. దామోదర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన పుస్తకాలు, విద్యా సామగ్రిని అందించడం తమ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింగం హనుమంతరావు, సతీష్ రావు, రామ్ లాలా దారి అకాడ పీఠాధిపతి శ్రీ వేదయోగి మహారాజ్, సాయన్న, సురేందర్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

