ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు రవిచంద్ర

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు రవిచంద్ర

📰 Generate e-Paper Clip

నిబద్ధతకు గుర్తింపుగా కీలక పదవి

పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన నియామకం

సమర్థ నాయకత్వానికి అధిష్ఠానం మరోసారి పెద్దపీట

నియామకాన్ని స్వాగతించిన మల్లెల రవిచంద్ర

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 09 (వార్త సంధ్య) : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నియమితులవడం పట్ల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెల రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వద్దిరాజు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మల్లెల రవిచంద్ర మాట్లాడుతూ, పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ కార్యకర్తలకు అండగా నిలబడి వారికి ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అని కొనియాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ ప్రయోజనాలనే ముందుంచి పనిచేసే నాయకత్వ లక్షణాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయని అన్నారు. అలాంటి సమర్థుడు, నిబద్ధత కలిగిన నాయకుడికి పార్లమెంటరీ పార్టీ నేత బాధ్యతలు అప్పగించడం పార్టీ అధిష్ఠానం తీసుకున్న ప్రశంసనీయమైన నిర్ణయమని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల సమస్యలు, రాష్ట్ర హక్కులు, ప్రజా ప్రయోజనాల అంశాలను మరింత సమర్థవంతంగా వినిపించే సామర్థ్యం వద్దిరాజు రవిచంద్రకు ఉందని మల్లెల రవిచంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మరింత బలోపేతమై, రాష్ట్ర ప్రయోజనాల కోసం సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నియామకం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ విశ్వాసాన్ని నిలబెడతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో మల్లెల రవిచంద్ర, కార్పొరేటర్ మల్లెల స్వప్నకుమారి, బండి వెంకటేశ్వర్లు, కొప్పుల సీతారాములు, నగేష్–కళావతి, దుర్గ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!