భద్రాద్రి, జూలై 06 (వార్త సంధ్య) : సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్‌ప్రెస్ (12745) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మణుగూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని, తిరుగు ప్రయాణంలో రాత్రి 9 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్‌కు బయలుదేరుతోంది. దీంతో ఈ రైలు రోజంతా మణుగూరు రైల్వే స్టేషన్‌లో ఖాళీగా నిలిచి ఉంటోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అదే రైలును మణుగూరు–చర్లపల్లి–మణుగూరు మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌గా నడపాలని ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కేంద్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార మరియు పర్యవేక్షణ వ్యవస్థ (సీపీగ్రామ్స్) ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఇంటర్‌సిటీ రైలును ప్రారంభిస్తే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, చర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, వైద్య సేవల కోసం ప్రయాణించే వారు, ఇతర సాధారణ ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు సేవ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రయాణికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని మణుగూరు–చర్లపల్లి–మణుగూరు మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును వీలైనంత త్వరగా ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.
మణుగూరు–చర్లపల్లి మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని విజ్ఞప్తి
RELATED ARTICLES

