ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeఇంటర్నేషనల్ఆరోగ్యంకామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడిలో అరుదైన ఘనత

కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడిలో అరుదైన ఘనత

📰 Generate e-Paper Clip

కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడిలో అరుదైన ఘనత

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్‌ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌ హైటెక్ సిటీ యూనిట్‌లోని యశోద హాస్పిటల్స్‌ కిడ్నీ మార్పిడి చికిత్సలో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ చక్రవర్తి నేతృత్వంలోని వైద్య బృందం వరుసగా 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి విశేష ఘనత సాధించింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ, సాధారణంగా రక్తగ్రూపులు కలవాల్సిన కిడ్నీ మార్పిడిని రక్తగ్రూపులు వేరుగా ఉన్న రోగులకు (ABO-Incompatible Transplant) కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం అత్యాధునిక సాంకేతికతతో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.

డాక్టర్‌ పి. విజయ్ వర్మ మాట్లాడుతూ, “డయాలసిస్‌ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కిడ్నీ మార్పిడి ద్వారా రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. మా బృందం సాధించిన 381 ట్రాన్స్‌ప్లాంట్లు కేవలం సంఖ్య కాదు, 381 కుటుంబాల్లో వెలుగులు నింపిన విజయగాథ” అని తెలిపారు.

అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో యశోద హాస్పిటల్స్‌ దేశంలోనే ప్రముఖ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కేంద్రంగా ఎదుగుతోందని వైద్యులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!