ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిదెబ్బతిన్న నరాలకు ఆధునిక శాస్త్ర చికిత్సలు మెడ భుజ గాయాలపై యశోద హాస్పిటల్ అవగాహన సదస్సు

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శాస్త్ర చికిత్సలు మెడ భుజ గాయాలపై యశోద హాస్పిటల్ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

 

  • దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్రచికిత్సలు
  • మెడ, భుజాల గాయాలపై యశోద హాస్పిటల్స్ అవగాహన సదస్సు

కామారెడ్డి, గురువారం: హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి యశోద సెంటర్‌లో మెడ, భుజాల గాయాలు మరియు బ్రేక్యాల్ ప్లెక్సస్ ఇంజరీ కారణంగా ఏర్పడే చేతి నరాల సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 28 ( వార్త సంధ్య)

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ పి. ప్రకాష్ మాట్లాడుతూ ప్రమాదాల వల్ల దెబ్బతిన్న నరాలకు ఆధునిక వైద్య సాంకేతికతతో శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చేతులకు సరఫరా చేసే నరాలు దెబ్బతింటే చేతుల కదలికలు తగ్గిపోవడం, భుజం బలహీనత, నరాల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు.

బాధితులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు, ఫిజియోథెరపీ ద్వారా సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ చికిత్సలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు.

సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణులను సంప్రదిస్తే చేతుల పనితీరును మెరుగుపరచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!