లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీడీవో జమలారెడ్డి
భద్రాద్రి, జూలై 31 (వార్త సంధ్య) : భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బూర్గంపహాడ్ మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ఎంపీడీవో జమలారెడ్డి సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గోదావరి వరదల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా నది, వాగులు, చెరువులు, కుంటలు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. చిన్నపిల్లలను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు...