- బూర్గంపహాడ్ మండల నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఆగస్టు 06 (వార్త సంధ్య) : యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే ధ్యేయంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల నూతన కమిటీలను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాళ్లగొమ్మూరు ఐటీసీ ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు యాకయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కమిటీతో పాటు యువజన కమిటీని ఏర్పాటు చేశారు. మండల గౌరవ అధ్యక్షుడిగా బొడ్డు నరసింహారావు యాదవ్, గౌరవ సలహాదారుగా బండారి లక్ష్మణరావు యాదవ్, మండల అధ్యక్షుడిగా బోళ్ల శ్రీశైలం యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మోడం రాధాకృష్ణ, కోశాధికారిగా చేతుల వలరాజు యాదవ్‌తో పాటు పలువురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువజన విభాగం అధ్యక్షుడిగా చేతుల శ్రీనివాసరావు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా బాసిపోయిన గంగరాజు యాదవ్, కోశాధికారిగా చుక్కా నరేష్ యాదవ్ సహా కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వల్లపు యాకయ్య యాదవ్ మాట్లాడుతూ, యాదవుల ఐక్యతే సంఘ బలోపేతానికి పునాది అని అన్నారు. కుల, పార్టీ భేదాలకు అతీతంగా ప్రతి యాదవ కుటుంబాన్ని సంఘంతో అనుసంధానం చేయాలని, విద్య, ఉపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి సంఘం అండగా నిలవాలని సూచించారు. గ్రామ స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేస్తూ యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్లాడి పుల్లారావు యాదవ్, జిల్లా కార్యదర్శులు కుక్కల సాంబయ్య యాదవ్, మారబోయిన శ్రీనివాస్ యాదవ్, యువజన జిల్లా అధ్యక్షుడు గొడపర్తి రాంబాబు యాదవ్, గళ్ళ నాగభూషయ్య, బూరం శ్రీనివాసరావు యాదవ్, చేతుల వీర్రాజు, పిడుగు కొండలరావు, వెంకట రామారావు తదితర సంఘ నాయకులు, యాదవ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

