- పేరుపల్లి గ్రామపంచాయతీలో జయంతి వేడుకలు
సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 6 (వార్త సంధ్య) : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోతు పద్మావతి, కాంగ్రెస్ నాయకుడు మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, ఉద్యమానికి అందించిన దార్శనికత చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆయన పోషించిన పాత్ర భావితరాలకు ఆదర్శప్రాయమని, సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్, మాజీ ఉపసర్పంచ్ బుడిగ ప్రభాకర్, కల్లూరి హైమావతి, ఎల్లబోయిన నరసింహరావు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

