బొల్లిమచ్చలు (విటిలిగో) చికిత్సలో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి

హైదరాబాద్‌, వార్త సంధ్య : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బొల్లిమచ్చలు (విటిలిగో/తెల్లపూత) వ్యాధిపై వైద్య నిపుణులు పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 3 నుండి 5 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, భారతదేశంలో కూడా ఇటీవలి కాలంలో దీని ప్రభావం పెరుగుతోందని తెలిపారు. అనువంశిక కారణాలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, విటమిన్-డి మరియు విటమిన్-బి లోపాలు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అదేవిధంగా మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, మానసిక ఒత్తిడి, కాలుష్యం వంటి అంశాలు...