ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeఉపాధిఎస్సీ గ్రూప్-III మాల 22వ రోస్టర్ అమలును సమీక్షించాలి MCF

ఎస్సీ గ్రూప్-III మాల 22వ రోస్టర్ అమలును సమీక్షించాలి MCF

📰 Generate e-Paper Clip

 

 రోస్టర్ విధానం వల్ల మాలలకు సమాన అవకాశాలు దక్కడం లేదని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి

Vaartha Sandhya Prathinidhi: హైదరాబాద్, జూలై 14, 2026 SC RESERVATION DIVISION & ROSTER POINTS మాల కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో, 2025 ఫిబ్రవరి 14 నుంచి తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న SC సబ్-క్లాసిఫికేషన్ 100-పాయింట్ రోస్టర్ విధానం మాల (SC-III) వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఫోరం ప్రతినిధులు వివరించిన ప్రకారం, SC రిజర్వేషన్లు మూడు గ్రూపులుగా విభజించబడ్డాయి. SC గ్రూప్-Iకి 1%, SC గ్రూప్-II (మాదిగ & అనుబంధ కులాలు)కి 9%, SC గ్రూప్-III (మాల & అనుబంధ కులాలు)కి 5% కేటాయించారు. 100-పాయింట్ల రోస్టర్‌లో SC-IIIకి తొలి అవకాశం 22వ స్థానంలో మాత్రమే రావడం వల్ల, 22 పోస్టుల కంటే తక్కువ ఉన్న నియామకాల్లో మాల అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోందని ఫోరం పేర్కొంది. చిన్న శాఖలు, తక్కువ పోస్టుల నోటిఫికేషన్లలో ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే SC కార్పొరేషన్ రుణాల పంపిణీ, ఉద్యోగాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మాల వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని పేర్కొన్నారు. కేవలం నాలుగు ప్రభుత్వ నోటిఫికేషన్లలోనే TSRTC డ్రైవర్, శ్రామిక్, సూపర్వైజర్, గ్రూప్-IV నియామకాలలో కలిపి 264కు పైగా పోస్టులు మాల అభ్యర్థులు కోల్పోయారని తెలిపారు. ఫోరం ప్రధాన డిమాండ్లు: ప్రతి నియామకంలో నిరంతర (సైక్లిక్) రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి. అన్ని శాఖల్లో 100-పాయింట్ల రోస్టర్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి. జిల్లా వారీ రోస్టర్లను రద్దు చేసి రాష్ట్ర స్థాయి సింగిల్ రోస్టర్ అమలు చేయాలి. SC-III తొలి రోస్టర్ పాయింట్‌ను 22వ స్థానం నుంచి మార్చాలి. రోస్టర్ పూర్తయిన తర్వాత అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధానం తీసుకురావాలి. కోల్పోయిన 264కు పైగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. SC-III వర్గానికి జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమైన రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలులో ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ రోస్టర్ విధానంలో ఎస్సీ గ్రూప్-III (మాల)కు కేటాయించిన 22వ రోస్టర్ పాయింట్‌ను తక్షణమే సమీక్షించాలని తెలంగాణ మాల సమన్వయ వేదిక (MCF) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు, భారత రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు అనుగుణంగా రోస్టర్ అమలు ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత రోస్టర్ విధానం ప్రకారం ఎస్సీ గ్రూప్-IIIకి 22వ రోస్టర్ పాయింట్ వద్ద మాత్రమే తొలి అవకాశం లభిస్తోందని, దీంతో 22 కంటే తక్కువ పోస్టులు ఉన్న నియామకాల్లో గ్రూప్-III అభ్యర్థులకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎంసీఎఫ్ పేర్కొంది. జిల్లా, శాఖ, సంస్థల వారీగా నియామకాలు జరగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని తెలిపింది.

ఈ పరిస్థితి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15(4), 16(1), 16(4), 46, 341లలో పొందుపరిచిన సమానత్వం, అవకాశాల సమానత్వం, తగిన ప్రాతినిధ్యం వంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఎంసీఎఫ్ అభిప్రాయపడింది. ప్రస్తుత రోస్టర్ విధానంపై శాస్త్రీయ, అనుభవపూర్వక సమీక్ష నిర్వహించాలని, 22వ రోస్టర్ పాయింట్‌ను సవరించాలని, చివరిగా నిండిన పాయింట్ నుంచి రోస్టర్ కొనసాగించే ఆవర్తన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే జిల్లా, శాఖల వారీ రోస్టర్ విభజనను రద్దు చేసి రాష్ట్రవ్యాప్త రోస్టర్ అమలు, స్వతంత్ర సమీక్ష కమిటీ ఏర్పాటు, కమ్యూనిటీ వారీగా ప్రాతినిధ్య డేటా విడుదల, ఇటీవల ఎస్సీ గ్రూప్-IIIకి ప్రాతినిధ్యం లభించని నోటిఫికేషన్‌ల సమీక్ష, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలైన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అన్ని షెడ్యూల్డ్ కులాలకు సమానంగా అందేలా ప్రస్తుత రోస్టర్ అమలుపై సమగ్ర సమీక్ష చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంసీఎఫ్ విజ్ఞప్తి చేసింది. గ్రూప్-III (మాల)కు 22వ రోస్టర్ పాయింట్‌ను సమీక్షించాలి. 22లోపు పోస్టుల నియామకాల్లో మాలలకు అవకాశం లేకుండా పోతోందని ఆందోళన. రోస్టర్‌ను చివరిగా నిండిన పాయింట్ నుంచి కొనసాగించాలి. జిల్లా, శాఖల వారీ రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించాలి.

స్వతంత్ర సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సమాన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!