ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeజర్నలిస్ట్అడ్డీషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి : కలెక్టర్ అంకిత్

అడ్డీషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి : కలెక్టర్ అంకిత్

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (వార్త సంధ్య) : జిల్లాలో ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలు తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికల వసతులు, అభివృద్ధి అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వారి భవిష్యత్‌కు దోహదపడే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల చేరికలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!