ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్అనుమతులు లేని ODY స్పాపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

అనుమతులు లేని ODY స్పాపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు.. నిర్వాహకుడు, సిబ్బందిపై కేసు నమోదు

వనస్థలిపురం, అక్టోబర్ 18 (వార్తసంధ్య): వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ODY స్పా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్పా సెంటర్‌ నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు లేకపోవడంతో పాటు, నిబంధనలు పాటించనట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

అర్హతలు లేని సిబ్బంది విధుల్లో..

పోలీసుల తనిఖీల సందర్భంగా స్పా సెంటర్‌లో అర్హతలు లేని సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పా సెంటర్‌ నిర్వాహకుడు మహబూబ్ స్వామితో పాటు, అర్హతలు లేకుండా పనిచేస్తున్న సిబ్బందిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

నిబంధనలు పాటించాలని పోలీసుల సూచన

స్పా సెంటర్లు, ఇతర సంస్థలను నిర్వహించే వారు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని, నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థలను నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!