అనుమతులు లేని ODY స్పాపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు.. నిర్వాహకుడు, సిబ్బందిపై కేసు నమోదు వనస్థలిపురం, అక్టోబర్ 18 (వార్తసంధ్య): వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ODY స్పా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్పా సెంటర్‌ నిర్వహణకు సంబంధించి అవసరమైన అనుమతులు లేకపోవడంతో పాటు, నిబంధనలు పాటించనట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అర్హతలు లేని సిబ్బంది విధుల్లో.. పోలీసుల తనిఖీల సందర్భంగా స్పా సెంటర్‌లో అర్హతలు లేని సిబ్బంది పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పా సెంటర్‌...