ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణధర్మాజీపేట 8వ వార్డులో “ఆరోగ్య లక్ష్మి” సరుకుల పంపిణీ

ధర్మాజీపేట 8వ వార్డులో “ఆరోగ్య లక్ష్మి” సరుకుల పంపిణీ

📰 Generate e-Paper Clip

గర్భిణీలు, బాలింతల ఆరోగ్యమే లక్ష్యం – కౌన్సిలర్ సాయి కుమార్ గౌడ్

దుబ్బాక, మే 5 (వార్త సంధ్య): దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట 08వ వార్డులో గల 01, 02 అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆరోగ్య లక్ష్మి” పథకం సరుకులను వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయి కుమార్ గౌడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల ఆశీర్వాదంతో ధర్మాజీపేట అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!