ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణనిరుపేద కుటుంబాలకు అండగా అఖిల రాజ్ పౌండేషన్

నిరుపేద కుటుంబాలకు అండగా అఖిల రాజ్ పౌండేషన్

📰 Generate e-Paper Clip

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 22 (వార్త సంధ్య) సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చికోడ్ గ్రామానికి చెందిన మేర పెంటయ్య అనారోగ్యంతో బాధపడుతూ జీవన పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న అఖిల రాజ్ ఫౌండేషన్ వెంటనే స్పందించింది.ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూకట్పల్లి ఎస్‌ఐ తౌడా సత్యనారాయణ ఆదేశాల మేరకు, ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలిసి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిల రాజ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఇనుప రవి, కంకణాల చంద్రం, బీమరి రాజు, షరీప్, బండ నర్సింలు, ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!