ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeతెలంగాణఅందం.. ఆత్మవిశ్వాసానికి సరికొత్త వేదిక ‘థియా సెలూన్’

అందం.. ఆత్మవిశ్వాసానికి సరికొత్త వేదిక ‘థియా సెలూన్’

📰 Generate e-Paper Clip

నాణ్యమైన సేవలతో మరింత అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్‌బీనగర్, ఆగస్టు 18 (వార్త సంధ్య): అందం, ఆత్మవిశ్వాసానికి ‘థియా సెలూన్’ సరికొత్త వేదికగా నిలవాలని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం వైదేహి నగర్ కాలనీలో నిర్వాహకులు రాజశేఖర్‌రెడ్డి, అమూల్య, మేక లోకేష్, మీరెడ్డి మధుకర్‌రెడ్డి సంయుక్తంగా ఏర్పాటు చేసిన థియా సెలూన్‌ను సోమవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక హంగులతో థియా సెలూన్‌ను వనస్థలిపురంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుత కాలంలో అందం, వ్యక్తిత్వ వికాసంతో పాటు బ్యూటీ, గ్రూమింగ్ సేవలకు మంచి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. మహిళలు, యువత అభిరుచులకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.

పరిశుభ్రత, నాణ్యత, కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యత ఇస్తూ సంస్థ ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని, భవిష్యత్‌లో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసి పలువురికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ వనస్థలిపురంలో థియా సెలూన్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కస్టమర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా బ్యూటీ, హెయిర్, స్కిన్, మేకప్, టాటూ, నెయిల్స్ తదితర సేవలను ఆధునిక సదుపాయాలతో అందించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రత, నాణ్యతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు అందించే ప్రతి సేవపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!