- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతి డిమాండ్
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఆగస్టు 06 (వార్త సంధ్య) : రైతులు ఎరువులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు గంగుల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, కార్మికులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పేపర్ లీకేజీలు, కార్మికులకు లేబర్ కోడ్‌లు, ఇప్పుడు రైతులకు యాప్ ఆధారిత ఎరువుల పంపిణీ విధానం తీసుకురావడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉండదని, యాప్ ఆధారిత విధానం వల్ల చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోతారని పేర్కొన్నారు. రైతులకు సులభంగా ఎరువులు అందేలా పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రభుత్వాలు చరిత్రలో నిలబడలేదని, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు.

