🟢 బ్రేకింగ్ న్యూస్ | కామారెడ్డి
వన మహోత్సవంలో భాగంగా గర్గుల్ గ్రామంలో 2,000 ఈత మొక్కల నాటకం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 23 ( వార్త సంధ్య )

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 2,000 ఈత మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, ఈత చెట్ల పెంపకం ద్వారా గౌడ కులస్తులకు కులవృత్తికి ఉపాధి లభించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో ఈత, ఖర్జూర చెట్ల నాటకం కొనసాగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గర్గుల్ గ్రామ సర్పంచ్ దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్,గౌడ్ సంఘం నాయకులు మొగుళ్ల సాయిగౌడ్, పెద్ద రాజా గౌడ్, మొగుళ్ల రామాగౌడ్, అలాగే ఎక్సైజ్ శాఖ సిబ్బంది నరసింహులు, శరత్ చంద్ర, దినేష్ కుమార్ మరియు ఇతర గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

