ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కొత్తగూడెం చేరుకున్న డీజీపీ.. ఎస్పీ ఘన స్వాగతం

కొత్తగూడెం చేరుకున్న డీజీపీ.. ఎస్పీ ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

భద్రాద్రి, జూలై 06 (వార్త సంధ్య): ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కొత్తగూడెం చేరుకున్న తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా డీజీపీ భద్రాచలంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పాల్వంచలో నూతన డీపీఓ భవనం, ఏఆర్ డీఎస్పీ క్వార్టర్స్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, పోలీస్ గెస్ట్ హౌస్‌లను ప్రారంభించనున్నారు. తదుపరి ఖమ్మం చేరుకుని మంగళవారం నిర్వహించనున్న నేర సమీక్ష సమావేశంలో డీజీపీ పాల్గొని, ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!