ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ కౌన్సిలర్ ఎస్‌కే మసూద్ మృతి

మాజీ కౌన్సిలర్ ఎస్‌కే మసూద్ మృతి

📰 Generate e-Paper Clip

భద్రాద్రి, జూలై 3 (వార్త సంధ్య) : కొత్తగూడెం పట్టణ మాజీ టిడిపి అధ్యక్షుడు, మాజీ 22వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కే మసూద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మసూద్ మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీపీఐ నాయకులు, టీడీపీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!