ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్హైదరాబాద్‌లో ఎక్స్-కా కాంపాక్ట్ యంత్రాల ఆవిష్కరణ.. ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌లో ఎక్స్-కా కాంపాక్ట్ యంత్రాల ఆవిష్కరణ.. ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: భారతీయ వాతావరణం, ఇక్కడి భూములకు అనుగుణంగా సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ఎక్స్-కా (XCA) మెషిన్స్ కాంపాక్ట్ యంత్రాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న “ఎర్త్‌కాన్ ఎక్స్‌పో 2026” వేదికగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సరికొత్త యంత్రాలను శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించారు. మంత్రి ఈసందర్భంగా యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వినూత్న యంత్రాల అవసరం మార్కెట్లో ఎంతైనా వుందని మంత్రి పేర్కొన్నారు.
​సిబిఐటి (CBIT) పూర్వ విద్యార్థులు, అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన ముగ్గురు తెలుగు ఐటీ నిపుణులు—కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి, కౌండిన్య అచ్చుతుని సంయుక్తంగా “ఎక్స్-కా మినీ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని గండిమైసమ్మ (డి. పోచంపల్లి) వద్ద ఉంది.

​మార్కెట్లోకి వచ్చిన యంత్రాలు – ధరలు..
సంస్థ ప్రస్తుతం పవర్ సైజ్డ్ రైట్’ నినాదంతో రెండు ప్రధాన యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది.
​XE15 (1.5 టన్ మినీ హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్)
ప్రారంభ ధర రూ. 12,00,000/-
​XS100 (కాంపాక్ట్ స్కిడ్ స్టీర్ లోడర్): ప్రారంభ ధర రూ. 14,00,000/-
​ఒకే యంత్రం.. అనేక ఉపయోగాలు:
ఈ యంత్రాలకు రాక్ బ్రేకర్స్, ఆగర్స్, కాంక్రీట్ మిక్సర్స్, ఫోర్క్‌లిఫ్ట్ వంటి వివిధ రకాల అటాచ్‌మెంట్లను అమర్చుకోవచ్చు. దీనివల్ల ఇవి వ్యవసాయం, రియల్ ఎస్టేట్, మున్సిపాలిటీలు, గేటెడ్ కమ్యూనిటీలు మరియు చిన్న తరహా నిర్మాణ రంగాలకు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
​ఈవీ వెహికల్స్, అకాడమీ స్థాపన..
భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా.. 1.5 టన్ మినీ హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్ యొక్క ఈవీ (EV) ప్రోటోటైప్‌ను ప్రదర్శించారు. దీనిని 2027 నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. అలాగే, కస్టమర్ల కోసం ప్రత్యేక ‘డెమో జోన్’ను, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ‘ఎక్స్-కా అకాడమీ’ని కూడా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి సిద్ధార్థ పోలిశెట్టి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!