హైదరాబాద్‌లో ఎక్స్-కా కాంపాక్ట్ యంత్రాల ఆవిష్కరణ.. ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: భారతీయ వాతావరణం, ఇక్కడి భూములకు అనుగుణంగా సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ఎక్స్-కా (XCA) మెషిన్స్ కాంపాక్ట్ యంత్రాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న “ఎర్త్‌కాన్ ఎక్స్‌పో 2026” వేదికగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సరికొత్త యంత్రాలను శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించారు. మంత్రి ఈసందర్భంగా యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వినూత్న యంత్రాల అవసరం మార్కెట్లో ఎంతైనా వుందని మంత్రి పేర్కొన్నారు. ​సిబిఐటి (CBIT) పూర్వ...