- బిక్నూర్ మండలంలో “అరైవ్-అలైవ్” అవగాహన
కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 10 ( వార్త సంధ్య )
గౌరవ కామారెడ్డి జిల్లా కలెక్టర్ అషిష్ సంఘ్వాన్ అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో బిక్నూర్ మండలంలో “అరైవ్-అలైవ్” కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
సైబర్ నేరాలపై అవగాహన:
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.
బ్యాంకు అధికారులు లేదా పోలీస్ అధికారులు ఎప్పుడూ ఓటీపీ అడగరని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 / 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో బిక్నూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ రేఖ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
✅ “హెల్మెట్ ధరించండి… సురక్షితంగా గమ్యానికి చేరుకోండి” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 🚦🪖

