ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం

📰 Generate e-Paper Clip

  • పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం

ZPHS స్కూల్, కృష్ణాజివాడి (తాడ్వాయి మండలం),కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి ZPHS పాఠశాలలో 2008-09 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 7 ( వార్తా సంధ్య)

చాలా సంవత్సరాల అనంతరం ఒకేచోట కలుసుకున్న సహ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశలో జరిగిన అనుభవాలు, స్నేహబంధాలు, గురువుల మార్గదర్శకత్వాన్ని స్మరించుకుంటూ పరస్పరం అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా తమ జీవితాలకు పునాది వేసిన గురువులను ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. పూర్వ విద్యార్థుల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేసిన ఈ సమ్మేళనం అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది.

భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పరస్పర సహకారం, స్నేహసంబంధాలను మరింత పెంపొందించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

“ఎన్ని సంవత్సరాలు గడిచినా పాఠశాల జ్ఞాపకాలు, స్నేహబంధాలు ఎప్పటికీ చెరగవు” అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!