మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు
హైదరాబాద్/ఖైరతాబాద్, వార్త సంధ్య : ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఆదివారం తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) జెండా గద్దె నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హలీమా ఆధ్వర్యంలో జరిగింది.
భూమి పూజ సందర్భంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ముస్లిం మత సంప్రదాయం ప్రకారం నమాజ్ కూడా నిర్వహించారు. రెండు మతాల ఆచారాలను ఒకే వేదికపై నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హలీమా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సమితి అధికారంలోకి రావడం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజన్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ అభివృద్ధి కోసం “కవితక్కతోనే మా ప్రయాణం” కొనసాగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ పోరాటం ఎప్పటికీ ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తేజ చౌదరి ప్రోగ్రాం ఇన్చార్జ్ మీనా చౌహన్ , లక్ష్మీనారాయణమ్మ , స్వాతి, పావని, లావణ్యతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
జూన్ 4న నిర్వహించనున్న జెండా పండుగ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని హలీమా పిలుపునిచ్చారు

