ePaper
Monday, July 13, 2026
📄 ePaper
Homeతెలంగాణచీకోడు ఐకేపీ కేంద్రంలో హమాలీలకు మజ్జిగ, మంచినీటి బాటిళ్ల పంపిణీ

చీకోడు ఐకేపీ కేంద్రంలో హమాలీలకు మజ్జిగ, మంచినీటి బాటిళ్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

దుబ్బాక ప్రతినిధి మే 13(వార్త సంధ్య ): దుబ్బాక మండలం చీకోడు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కూలీలు, రైతులకు వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు మంగళవారం మజ్జిగ మరియు మంచినీటి బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 1వ వార్డు మెంబర్ షరీఫ్, 3వ వార్డు మెంబర్ కంకణాల రాజు ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత తీవ్రమైన ఎండల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీలు, రైతులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది సి.ఎ.లు చెలుకల పద్మ, బండ రేణుక, వీవోలు వేద, బండ రేణుక, స్థానిక రైతులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!