చీకోడు ఐకేపీ కేంద్రంలో హమాలీలకు మజ్జిగ, మంచినీటి బాటిళ్ల పంపిణీ

దుబ్బాక ప్రతినిధి మే 13(వార్త సంధ్య ): దుబ్బాక మండలం చీకోడు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కూలీలు, రైతులకు వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు మంగళవారం మజ్జిగ మరియు మంచినీటి బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 1వ వార్డు మెంబర్ షరీఫ్, 3వ వార్డు మెంబర్ కంకణాల రాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత తీవ్రమైన ఎండల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీలు, రైతులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....