ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిఎల్‌ఐసీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు

ఎల్‌ఐసీ కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు

📰 Generate e-Paper Clip

కామారెడ్డి లోనీ LIC ఆఫీసు కామారెడ్డి బ్రాంచ్ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 2 ( వార్త సంధ్య ) :కామారెడ్డిలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ICEU, LIAFI, నాయకులు, CITU నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావ్యతిరేక లేబర్ కోడ్ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగం ద్వారా సాధించుకున్నా కార్మిక చట్టాలను కాలరాసి, దేశ నిర్మాణంలో కీలకమైన కార్మికుల కనీస అవసరాలను వారికి అందకుండా ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. యాజమాన్యం దయ దక్షిణ్యాల మీద బ్రతుకు సాగించే రోజు మళ్ళీ ఈ దేశ ప్రజల పైన రుద్దాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. తద్వారా బానిస బ్రతుకుల బాటను పునః ప్రతిష్టిస్తుందని అందుకే , కొత్త. లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్ని యూనియన్ల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో, ICEU కామారెడ్డి నాయకులు నాగేశ్వర రావు, నర్సింలు, నయిముద్దీన్ మరియు, CITU నాయకులు చంద్రశేఖర్, అరుణ్ అలాగే LIAFI నాయకులు కదం నారాయణ రావు, శేఖర్,రాజ్ కుమార్ , ప్రవీణ్,CITU నాయకులు రాజ నర్సు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!