ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరువూరులో అవగాహన కార్యక్రమం...

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరువూరులో అవగాహన కార్యక్రమం…

📰 Generate e-Paper Clip

తిరువూరు,ఏప్రిల్ 25(వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు నియోజకవర్గం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువూరు పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మలేరియా, డయేరియా వంటి వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.దోమల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు,ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడటం, చెట్లు పొదలు అధికంగా పెరగకుండా శుభ్రపరచడం ముఖ్యమని తెలిపారు.ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అవసరమైతే పంచాయతీ శాఖ సహాయం తీసుకోవాలని,అలాగే ఆషా వర్కర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!