ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తిరువూరులో అవగాహన కార్యక్రమం…
తిరువూరు,ఏప్రిల్ 25(వార్త సంధ్య): ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు నియోజకవర్గం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువూరు పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ రేష్మా బేగం ఆధ్వర్యంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మలేరియా, డయేరియా వంటి వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.దోమల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు,ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడటం, చెట్లు పొదలు అధికంగా పెరగకుండా శుభ్రపరచడం ముఖ్యమని తెలిపారు.ముఖ్యంగా...