ePaper
Thursday, April 23, 2026
📄 ePaper
Homeతెలంగాణబీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

📰 Generate e-Paper Clip

మణుగూరు, ఏప్రిల్ 22 (వార్త సంధ్య) : మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రేగ కాంతారావు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!