- బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత
- ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహాయం
- పేదలకు వరంలా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే వ్యాఖ్య
ఎల్.బి.నగర్, మార్చి 17 (వార్త సంధ్య): సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీకి చెందిన విజయకుమారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఆమె కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.విజయకుమారి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా, ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను సంప్రదించారు. వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి, ఆపరేషన్‌కు కావలసిన ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఎల్‌ఓసీ రూపంలో మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ పథకం పేద ప్రజలకు ఒక వరంలాంటిదని, నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు ఇది అండగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, ఆందోజు సత్యంచారి, పగిడిమర్రి శంకర్, నారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

