ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeతెలంగాణగ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం, మెడికల్ టెస్టులు

గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం, మెడికల్ టెస్టులు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, మంథని మార్చి 15 (వార్త సంధ్య):ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిలో సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పంచాయతీ అధికారి సమ్మిరెడ్డి హాజరయ్యారు. గ్రామ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శారద, ఆశా వర్కర్లు శిరీష, సుమలత, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!