గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమం, మెడికల్ టెస్టులు

పెద్దపల్లి, మంథని మార్చి 15 (వార్త సంధ్య):ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిలో సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పంచాయతీ...