ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeతెలంగాణసంజీవని శక్తి కిట్లతో బీడీ కార్మికులకు అండ

సంజీవని శక్తి కిట్లతో బీడీ కార్మికులకు అండ

📰 Generate e-Paper Clip

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 24(వార్త సంధ్య ):

బీడీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దుబ్బాక మండలం శివాజీ నగర్ తాండలో సంజీవని శక్తి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీమ్ కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ మహిళా బీడీ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడీలు చుట్టే మహిళలు కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.సంజీవని శక్తి కిట్లు వారి ఆరోగ్యానికి తోడ్పడతాయని, తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, సర్పంచ్ బానోతు సునీత సంతోష్, ఉప సర్పంచ్ భవిష బాబు, మహేందర్ గౌడ్, పరశురామ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!