పాల్వంచలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాజీవ్‌కు నిజమైన నివాళి
దేశాన్ని ఆధునిక భారత్‌గా తీర్చిదిద్దిన నేత రాజీవ్ గాంధీ
యువతకు సాంకేతిక విప్లవ దిశగా మార్గం చూపిన దూరదృష్టి నాయకుడు
రాజీవ్ ఆశయాల సాధనకే కాంగ్రెస్ కట్టుబడి ఉంది
రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 21 (వార్త సంధ్య) : భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ అభివృద్ధి, సాంకేతిక విప్లవం, పేదల సంక్షేమం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
అనంతరం కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేయడం ఆయన గొప్పతనమన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న అఖిల భారత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చేయడమే రాజీవ్ గాంధీకి ఘనమైన నివాళి అవుతుందని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దంతెబోయిన నరేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, జిల్లా లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణరావు, కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం, వై. వెంకటేశ్వరరావు, కాపర్తి వెంకటాచారి, చింత నాగరాజు, ఎస్.కె. ఖాజామియా, బొశెట్టి సాంబయ్య, సయ్యద్ కరీం, బూసి శ్రీనివాస్, ఎస్.కె. బాషా, కటుకూరి శేఖర్, కొత్తపల్లి రవి, షఫీ, రఫి, కూరగాయల మార్కెట్ కమిటీ నాయకులు శివ, సత్యనారాయణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

