ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిభార్యతో గొడవ నేపథ్యంలో మనస్తాపంతో గడ్డిమందు తాగిన వ్యక్తి మృతి

భార్యతో గొడవ నేపథ్యంలో మనస్తాపంతో గడ్డిమందు తాగిన వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

  • భార్యతో గొడవ నేపథ్యంలో మనస్తాపంతో గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి
  •  కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూన్ 11 ( వార్తా సంధ్య )

కామారెడ్డి జిల్లా పరిధిలోని రామేశ్వర్‌పల్లి తాండకు చెందిన గుగ్లోత్ బాల్ సింగ్ (42), తండ్రి రాజు, వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపానికి గురైన బాల్ సింగ్ గుర్తుతెలియని గడ్డి మందు సేవించాడు.

అస్వస్థతకు గురైన అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు.

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల పూర్తి కారణాలను పోలీసులు విచారిస్తున్నరు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!