ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిదెబ్బతిన్న నరాలకు ఆధానిక చికిత్స

దెబ్బతిన్న నరాలకు ఆధానిక చికిత్స

📰 Generate e-Paper Clip

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స

*మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు*

 

కామారెడ్డి, గురువారం: హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని Yashoda Hospitals ఆధ్వర్యంలో కామారెడ్డి యశోద సెంటర్‌లో మెడ, భుజాల గాయాలు మరియు బ్రేక్యాల్ ప్లే సెస్ ఇంజురీ తో చేతి నరాల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ పి. ప్రకాష్ మాట్లాడుతూ ప్రమాదాల వల్ల దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 28 ( వార్త సంధ్య )

చేతులకు సరఫరా చేసే నరాలు దెబ్బతింటే చేతుల కదలికలు తగ్గిపోవడం, భుజం బలహీనత, నరాల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు. బాధితులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మరియు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ చికిత్సలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే చేతుల పనితీరును మెరుగుపరచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!