జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు సూగురు రాములు ఆధ్వర్యంలోఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతి పత్రం..
కుమ్మర్లకు మట్టి కష్టాలు తీర్చేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరువ చూపాలి….
మట్టి లభించే కుంటలు, చెరువుల గుర్తింపు,.. ఉచితమట్టిరవాణాకు సౌకర్యాలు కల్పించాలి..
కులవృత్తి నైపుణ్యం కొరకు ప్రత్యేక ( క్లస్టర్) శిక్షణ కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి.
వార్త సంధ్య :వనపర్తి జిల్లా ప్రతినిది, అక్టోబర్ 12:
కుమ్మరుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆతుకూరి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎమ్మెల్యే మెఘారెడ్డి చొరవతొ వనపర్తి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయించడం పట్ల వనపర్తి కుమ్మరి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు,ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి శాలువాతో సన్మానం చేసి వనపర్తి కుమ్మరి సంఘం నాయకులు అభినందనలు తెలిపారు.
వనపర్తి జిల్లాలో తరతరాలుగా కుమ్మరి వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ,చూపాలని కుమ్మరి వృత్తికి ప్రధాన ఆధారమైన మట్టి లభ్యత రోజురోజుకూ కష్టతరంగా మారడంతో,మట్టి లభించే కుంటలు,చెరువుల నుంచి కుమ్మరులకు ఉచితంగా మట్టి పొందే అవకాశం కల్పించాలని, అలాగే మట్టిని తమ గ్రామాలకు, పని ప్రదేశాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కుమ్మరి సంఘం నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కుమ్మర్లకు మట్టి కష్టాలు తీర్చేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉచితంగా మట్టి అందించేలా చర్యలు తీసుకోవాలని కుమ్మరి వృత్తిదారుల,వారి జీవనోపాధికి సహకారం అందించాలని,సంఘం నాయకులు కోరారు.
కుమ్మర్ల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి….
వనపర్తి పట్టణ పరిధితో పాటు,వనపర్తి మండల పరిధిలో మట్టి లభించే కుంటలు,చెరువులను గుర్తించి, కుమ్మరులకు అవసరమైన మట్టి ఉచితంగా లభించేలా సంబంధిత అధికారుల ద్వారా తగిన సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే మెఘారెడ్డి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వనపర్తి జిల్లాలోని 15 మండలాలకు సంబంధించిన కుమ్మర సంఘం నాయకులు, మాతృ సంఘం సభ్యులు,స్టీరింగ్,జిల్లా ప్రధాన కార్య దర్శి,యువజన అధ్యక్షులు,ప్రధాన కార్య దర్శి కులపెద్దలు,నాయకులు, పొలిటికల్ కన్వినర్ తదితరులు పాల్గొన్నారు.

